Header Banner

చావుదాకా వెళ్లిన ముమైత్ ఖాన్.. ఆమె బ్రెయిన్‌లో 9 వైర్సా.! ఏం జరిగిందంటే?

  Mon May 05, 2025 11:00        Entertainment

సినీ అభిమానులకు ముమైత్ ఖాన్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. 'ఇప్పటికింకా నా వయసు పదహారేళ్లే' అనే పాటతో ప్రేక్షకుల హృదయాలకు హత్తుకున్న ముమైత్ ఖాన్ దాదాపు ఏడు సంవత్సరాలు ఇండస్ట్రీకి దూరంగా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. తెలుగు, హిందీ, కన్నడ భాషల్లోని అనేక చిత్రాల్లో స్పెషల్ సాంగ్స్ చేసినా, నటిగా పలు చిత్రాల్లో మెప్పించినా ఆమెకు మాత్రం 'ఇప్పటికింకా నా వయసు' ఐటమ్ సాంగ్‌తోనే మంచి పాప్యులారిటీ వచ్చిందనడంలో ఎటువంటి సందేహం లేదు. తాజాగా తేజస్వి మదివాడ హోస్ట్ చేస్తున్న ఆహా ప్లాట్‌ఫామ్‌లో ప్రసారం అయ్యే 'కాకమ్మ కథలు' అనే టాక్ షోకి స్టార్ కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్‌తో కలిసి హాజరైన సందర్భంలో తను ఎదుర్కొన్న ఆరోగ్య సమస్యల గురించి ముమైత్ ఖాన్ షాకింగ్ విషయాలను వెల్లడించింది.

 

ఇది కూడా చదవండి: బాలీవుడ్‌లో క‌ల‌క‌లం! ఆ నటుడుపై అత్యాచార కేసు నమోదు!

 

ఇంట్లో డ్యాన్స్ చేస్తూ కాలు స్లిప్ అయి కింద పడ్డానని, దాంతో బ్రెయిన్‌లో నరాలు దెబ్బతిన్నాయని తెలిపింది. ఆ సమయంలో సర్జరీ అయింది. దాదాపు 15 రోజులు కోమాలోనే ఉన్నాను. కొంత మెమరీ లాస్ అయింది అని చెప్పింది. ప్రస్తుతం తన బ్రెయిన్‌లో 9 వైర్స్ ఉన్నాయని తెలిపింది. సర్జరీ అయిన మూడు నెలలకే సూపర్ షో చేయడానికి వెళ్లానన్నారు. పెద్ద సౌండ్ వచ్చినా తట్టుకోలేనని అలాంటిది స్టంట్స్ చేశానని అయితే మరుసటి రోజు పొద్దున్నే తాను లేవలేకపోవడంతో అందరూ కంగారు పడి ఆసుపత్రికి తీసుకువెళ్లారన్నారు. ఆ సమయంలో సర్జరీ చేసిన డాక్టర్ ఏడేళ్లు విశ్రాంతి తీసుకోవాలని సూచించారని చెప్పారన్నారు. తాను పని చేయకపోతే ఎలా బతకాలని అనుకున్నాను, కానీ తప్పలేదన్నారు. మందులు వాడటం వల్ల చాలా లావు అయ్యాను. ఫేస్ పాడైపోయింది. ఈ ఇండస్ట్రీలో ఫేస్, ఫిట్‌నెస్ ముఖ్యం. ఇప్పుడు ఇన్నేళ్ల తర్వాత మళ్లీ నా బాడీ మీద ఫోకస్ పెట్టి గతంలో ఉన్నట్లు రెడీ అయి తిరిగి వచ్చానన్నారు. ఇప్పుడు ఒక టీవీ షో చేస్తున్నానని, కొత్త బిజినెస్ మొదలు పెట్టానంటూ ఏడేళ్ల తను పడ్డ కష్టాన్ని ముమైత్ ఖాన్ పంచుకున్నారు. 

 

ఇది కూడా చదవండి: పలు నామినేటెడ్ పోస్టులు భర్తీ చేసిన సీఎం చంద్రబాబు! లిస్ట్ ఇదుగోండి..

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

షాకింగ్ న్యూస్: జగన్ హెలికాప్టర్ ఘటన దర్యాప్తు వేగవంతం! 10 మంది వైసీపీ కార్యకర్తల అరెస్ట్!

 

నెల్లూరు రూరల్ అభివృద్ధి అద్భుతం.. 60 రోజుల్లోనే 339 అభివృద్ధి పనులు పూర్తి! మంత్రి ప్రశంసలు

 

పాన్ ఇండియన్ సోషియో కల్చరల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో.. జాతీయ సాంస్కృతోత్సవ పురస్కార వేడుక!

 

ఏపీ యువతకు గుడ్ న్యూస్.. యునిసెఫ్‌తో ప్రభుత్వం ఒప్పందం.. 2 లక్షల మందికి లబ్ధి!

 

అడ్డంగా బుక్కైన ప్రపంచ యాత్రికుడు అన్వేష్.. పోలీస్ కేసు నమోదు.. ఏం జరిగిందంటే?

 

జైలులో మాజీమంత్రి ఆరోగ్య పరిస్థితి విషమం! ఆసుపత్రికి తరలింపు..!

 

ఏపీ ప్రజలకు శుభవార్త! రూ.3,716 కోట్లతో.. ఆ రూట్లో ఆరు లైన్లుగా నేషనల్ హైవే!

 

సంచలన నిర్ణయం తీసుకున్న OYO హోటల్స్.. మరో కొత్త కాన్సెప్ట్‌తో - ఇక వారికి పండగే..

 

నిరుద్యోగులకు శుభవార్త.. నెలకు రూ.60 వేల జీతం.. దరఖాస్తుకు మే 13 చివరి తేదీ!

 

ఇక బతకలేను.. నా చావుకు కారణం వాళ్లే! ఢీ ఫేమ్ జాను కన్నీటి వీడియోతో కలకలం!

 

ఏపీలో చిన్నారులకు తీపికబురు - 18 ఏళ్ల వరకు ప్రతి నెలా రూ.4 వేలు! ఈ పథకం గురించి తెలుసా, దరఖాస్తు చేస్కోండి!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #Tollywood #Bollywood #Mumtazkhans #HealthRevelation #ViralNews